- ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్
కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డయాగ్నస్టిక్ సెంటర్,స్కానింగ్ సెంటర్ లు అధిక ధరలు పెంచి మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్ ల యాజమాన్యలపైన విచారణ చేయాలని పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని ఆయనకోరారు.సోమవారం రోజున అధిక ఫీజులు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ లో విచ్చల విడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆఫర్ ల పేరుతో ఆర్ఎంపీపీ ఎంపీల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా అనుమతులు లేకుండా ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా సరియైన పార్కింగ్ స్థలాలు లేకుండా,మంచినీటి,వెయిటింగ్ హాల్ లేకుండా,చిన్నచిన్న గదులలో ఏర్పాటు చేసుకొని, సరియైన వసతులపైన దృష్టి సారించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు డిమాండ్ చేశారు.వెంటనే స్కానింగ్,డయాగ్నస్టిక్ సెంటర్లో ఫీజులు తగ్గించలేని ఎడల ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
