కాంగ్రెస్ పార్టీ లో చేరిన కమలాపూర్ ఎంపీపీ

By dhanadhannews.com

  • కమలాపుర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా
  • హుజురాబాద్ లో ప్రణవ్ నాయకత్వానికి బలం చేకూర్చండి

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కమలాపూర్ మండలం ఎంపిపి తడ్క రాణి శ్రీకాంత్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ  నుండి దాదాపు 50 మందికి పైగా ముఖ్యనేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రణవ్ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా ప్రణవ్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకునేలా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని,సమస్యలు ఏవైనా గ్రామాలలో ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని మంత్రి సహకారంతో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.