జమ్మికుంట/ధనాధన్ న్యూస్: స్నేహమంటే బ్రతికుండగా చట్టపట్టలేసుకొని తిరగడం కాదు,స్నేహితుడు మరణించిన తర్వాత కూడా తన కుటుంబానికి అండగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంటకు చెందిన పలువురు యువకులు.వివరాల్లోకి వెళితే ఇటీవల
జమ్మికుంట పట్టణం దుర్గా కాలనీలో నివసించే తిప్పిరెడ్డి సురేష్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించగా మృతుని కుటుంబానికి తనతోపాటు పాఠశాలలో చదువుకున్న స్నేహితులు 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఆకుల తిరుపతి,కోడూరు రాజేష్,రవి కృష్ణ రచ్చ, భాషవేనీ భాస్కర్, కలకోటి కపిల్ తదితరులు పాల్గొన్నారు.
