జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లోని 24 వ వార్డు నందు రాజేష్ ఠాకూర్ రాకేష్ ఠాగూర్ ఆధ్వర్యంలో కన్య పూజ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారని దుర్గామాత అని తలవగానే మన మదిలో త్రిశూలధారియై దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు,కానుకలు ఇస్తారు.దీన్ని కన్యా పూజ అంటారు.బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు.అందుకే తొమ్మిది మంది బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు.ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు పొందినట్టుగా భావిస్తారు.పూజ చేసిన తర్వాత ఖీర్ సమర్పించి దక్షిణ తాంబూలం అందిస్తారు.బొమ్మలకొలువు పేరంటం కొనసాగిస్తారని చెప్పడం జరిగింది.అనంతరం మహిళలు బతుకమ్మ పాటలతో కోలాటాలతో దాండియా ఆటపాటలు కొనసాగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, జమ్మికుంట పట్టణ కార్యదర్శి రాకేష్ ఠాగూర్, కుటుంబ సభ్యులు బంధువులు వార్డు సభ్యులు పాల్గొనడం జరిగింది.
