జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రాయికల్ గ్రామ రైతులు

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీవో సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డిఓ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12 లక్షల 20,000 ఇస్తారని హుజురాబాద్ ఆర్డీవో తెలిపారు.అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ లెగిచర్ల గ్రామంలో ఎకరానికి 20 లక్షలు ప్రకటించడం జరిగింది తేదీ13,2,2025 లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాయికల్ గ్రామ రైతులకు కూడా ఎకరానికి 20 లక్షలు ప్రకటించాలి అని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కు కలిసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాయికల్ గ్రామ రైతులు జేరిపోతుల రాజు,గూళ్ల కనకయ్య,నేరెళ్ల పోచయ్య,పైడాకుల రమ,గడిపే ఎల్లమ్మ,మొలుగూరి రవి,శనిగరపు కొమరయ్య,దాడి ఎల్లయ్య,మారుపాక రాజు,గడిపే లింగమూర్తి, నేరెళ్ల సదయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.