- రేషన్ కార్డు లబ్దిదారుని ఇంటికి స్వయంగా వెళ్లి సహపంక్తి భోజనం చేసిన ప్రణవ్
- ప్రణవ్ రాకతో సంతోషాన్ని వ్యక్తం చేసిన ఇందిరానగర్ వాసులు
- సన్నాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ
- హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ నాయకుడు రాలేదని స్వయంగా ప్రణవ్ మా ఇంటికి రావడం ద్వారా నిజమైన పండుగ వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.అనంతరం వారి కుటుంబంతో సహపంక్తి భోజనం చేశారు.రేషన్ కార్డులో వచ్చిన సన్న బియ్యాన్ని లబ్దిదారులు వంట చేసి ప్రణవ్ కు వడ్డించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తీర్చే పార్టీ అని,ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యతో భోజనం చేయడం సంతోషాన్ని కలిగించిందని,ధనిక వర్గాలు తినే సన్న బియ్యం నిరుపేద గడపల్లో కూడా వండడం గొప్ప విషయమని అన్నారు.గతంలో దొడ్డు బియ్యం ఇస్తే లబ్దిదారులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని,ఇప్పుడు రేషన్ షాపులో సన్నబియ్యం కోసం పోటీ పడుతున్నారని,పథకం ప్రవేశపెట్టిన వారం రోజులలోపే 95% మంది సన్నబియ్యం తీసుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఉచిత సన్నబియ్యం కొనసాగుతుందని,దేశ చరిత్రలో నిలిచిపోయే పథకమని అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటూ సంక్షేమ పథకాలైన సన్నబియ్యం,గృహ జ్యోతి,మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం,500 కే సిలెండర్ లాంటి పథకాల ద్వారా ఒక్కో రేషన్ కార్డు లబ్దిదారులకు నెలకు 2500 వరకు ఆదా జరుగుతుందని అన్నారు.ఇలాంటి మంచి పథకాలు కొనసాగిస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు.
మేము తినే అన్నమే సారు తిన్నారు-లబ్ధిదారులు శ్రీవాణి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యాన్ని పేదలకు పంచడం ఆనందంగా ఉందని లబ్దిదారురాలు శ్రీవాణి అన్నారు.ఆహ్వానం మేరకు ప్రణవ్ మా ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించిందని,మేము తినే అన్నమే ప్రణవ్ కు స్వయంగా వడ్డించామని అన్నారు.గతంలో రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉందని ఇప్పుడు రేవంత్ సర్కార్ లో సన్నబియ్యంతో కడుపు నింపుతున్నారని ఆన్నారు.
