రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

By dhanadhannews.com

  • జాడ పత్తాలేని రాజీవ్ యువ వికాసం
  • బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని


వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు  ఏప్రిల్ 14,  ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు కూడా రాజీవ్ యువ వికాసం ఊసే ఎత్తడం లేదని యువతను ఓట్ల కోసం తప్ప వాళ్ల బాగోగుల కోసం ఉపాధి కోసం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ అవకాశాల కోసం చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం చెందిందని నిరుద్యోగ భృతి ఇస్తానని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు చేసిన మేలు ఏమీ లేదని అన్నారు .రాజీవ్ యువ వికాసం పేరుతో దరఖాస్తుదారులకు అదనపు పెను భారం మోపారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు .చెప్పడం కొండంత చేయడం మాత్రం ఏమీ లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు రుణాలు మంజూరు చేస్తానని చెప్పి చేయకపోవడం పట్ల యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైనటువంటి యువతకు రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది..