కనగర్తి ప్రజలారా! ఇది కేవలం ఎన్నిక కాదు, మన గ్రామానికి ‘పునర్జన్మ’!

By dhanadhannews.com

  • దశాబ్దాల చీకటిని చీల్చి, కనగర్తిలో కాంతి కిరణాలు నింపుతా!
  • నాకు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి, మన గ్రామ అభివృద్ధి కి పునర్జన్మనవుతా!
  • మీ ఆశల ప్రతిరూపం,సర్పంచ్ అభ్యర్థి బండి సంధ్యారాణి మల్లేష్

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: గ్రామ చరిత్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి, పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన శ్రీమతి బండి సంధ్యారాణి మల్లేష్ తీవ్ర ఉద్వేగంతో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఈ ఎన్నికను కేవలం పదవి కోసం కాదని, గ్రామానికి పునర్జన్మ ఇవ్వడం కోసం జరుగుతున్న చారిత్రక పోరాటంగా అభివర్ణించారు.
జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ సతీమణి అయిన సంధ్యారాణి మల్లేష్ మాట్లాడుతూ, “మీరు నన్ను 10 ఏళ్లుగా చూస్తున్నారు. అధికారం లేకపోయినా, అధికార అండదండలు లేకపోయినా, కనగర్తి ప్రజల గొంతుకగా నిలబడ్డాను. అవినీతి రక్కసిని ఎదుర్కొన్నాను. ఏనాడూ కాంగ్రెస్ జెండాను కింద పడేయలేదు, మీ సమస్యల ఏజెండాను వదిలిపెట్టలేదు,” అని స్పష్టం చేశారు.


“కనగర్తి గ్రామాన్ని దోచుకుంటున్న పాలకుల చేతిలో మరోసారి మోసపోవద్దు. కేవలం ఒక్కసారి, ఒక్కసారి మాత్రమే నాకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి. ఈ సంధ్యారాణి మల్లేష్ ప్రమాణం చేస్తోంది: 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని నేను కేవలం 12 నెలల్లో చేసి చూపిస్తాను. మా కనగర్తిని మండలంలోనే కాదు, జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాది!”


మీరే నా బలం, మీ కష్టమే నా రుణం!
సంధ్యారాణి మల్లేష్ గారి హామీలు:
100% పారదర్శక పాలన: ప్రభుత్వ నిధులు ప్రతి పైసా గ్రామ అభివృద్ధికి మాత్రమే.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు: తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం.
నాణ్యమైన అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ: పారిశుద్ధ్యంలో రాజీ లేదు.
యువతకు ఉపాధి మార్గాలు, మహిళలకు చేయూత పథకాలు: సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ.
“గ్రామాన్ని మీ కళ్ల ముందే మారుస్తాను.మీ జీవితాలు మెరుగుపడాలంటే,మీ సమస్యలు తీరాలంటే…ఈసారి మార్పు మన నుంచే మొదలవ్వాలి.మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి, బండి సంధ్యారాణి మల్లేష్ కి వేసి, కనగర్తి గెలుపుకు కారణం అవ్వండి!”