- అంజన టౌన్షిప్ పై ఆధారాలు లేని ఆరోపణలు
- మేము అన్ని ప్రభుత్వ అనుమతులతో లేఔట్ చేసినం
- జమ్మికుంటకే తలమానికంగా అంజన టౌన్షిప్ ఉంటది
- నాపై రాజకీయ కక్ష సాధింపు కోసం,సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు
- జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్ షిప్ పై నిరాధార వార్తలు రాస్తున్న,ప్రచురిస్తున్న పత్రికా, ఛానెళ్ల పై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేశామని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తనని రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిర్మాణం చేయబడ్డ అంజనా టౌన్ షిప్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశామని నిరాధార ఆరోపణలు చేస్తూ, పలుమార్లు లోకాయుక్త లో పిర్యాదు చేస్తూ, అధికారుల విచారణ సమయంలో హాజరు కాకుండా ముఖం చాటేస్తు తిరుగుతూ, కొందరు పత్రిక విలేకరులతో తప్పుడు కథనాలు రాయిస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.అంజనా టౌన్ షిప్ లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని పలుమార్లు అధికారులకు పిర్యాదు చేశారని, అధికారులు విచారణలో ప్రభుత్వ భూమి కబ్జా జరుగలేదని తేల్చినా, పలుమార్లు పిర్యాదు చేస్తూ అంజనా టౌన్ షిప్ లో నివశిస్తున్న కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. అంజనా టౌన్ షిప్ కి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అందులో ఒక్క గుంట ప్రభుత్వ భూమి కబ్జాకి గురైనట్లు విచారణలో తేలినా అట్లాంటి భూమిని మున్సిపాలిటీ కి అప్పగిస్తామని మీడియా ముఖంగా తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందని నిరాధార వార్తలు ప్రచురిస్తున్న పత్రికా, ఛానెళ్ల పై పరువు నష్ట దావా నోటీసులు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో అంజనా టౌన్ షిప్ కి సంబంధించిన పర్మిషన్ పేపర్లు, నిరాధార వార్తలు రాస్తున్న పత్రికలను మీడియా ముఖంగా చూపిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
