
వీణవంక,ధనాధన్ న్యూస్:
వీణవంక మండలకేంద్రంలో యుప్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదిన వేడుకలును యాప్ టీవీ ఉద్యోగులు మరియు టూరిటో మహిళా ఉద్యోగులు,వీణవంక గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు స్థానికులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల పేద ప్రజలకు అండగా ఉంటూ,నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యాప్ టీవీ మరియు టూరిటో ఉద్యోగులులతో పాటు వీణవంక మండల కో ఆప్షన్ ఎమ్ ఎ హమీద్,మ్యాకల సమ్మిరెడ్డి,సింగిరెడ్డి సమ్మిరెడ్డి,వెనంపల్లి నారాయణ,అమృత ప్రభాకర్,మంతెన శ్రీధర్,సమీండ్ల బాబురావు, చిట్టీ,వెంకన్న,వీణవంక గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.