సైదాపూర్ లో బీఆర్ ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తలు సమావేశం

సైదాపూర్ మండలం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్  బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే  కరీంనగర్ కధన  బేరి కి సభకు మండలం నుండి 2000 వెల మంది తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి,జడ్పీ వైస్ ఛైర్మన్ గోపాల్ రావు,వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  రాజేశ్వర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ లు కొత్త తిరుపతి రెడ్డి,బిల్లా వెంకట్ రెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ లు,బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.