కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే29:సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి  మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన భార్య పద్మ కుటుంబసభ్యుల సమక్షంలో మాజీ  ఎమ్మెల్యే సతీష్ కుమార్  అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  భారత రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్తగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి,మండల బారాస పార్టి అధ్యక్షులు సోమరపు రాజయ్య,పాక్స్ అధ్య్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి,బారాస మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్ రెడ్డి,మాజీ సర్పంచ్  కయిత రాములు,పోతరాజు సంపత్ పాల్గొన్నారు.