నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

  • జగిత్యాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శ్రీకారం

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 28: ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేమాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలోని అన్ని పోలియో కేంద్రాల్లో చుక్కలు అందుబాటులో ఉన్నాయని, సోషల్ మీడియా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పోలియో బూత్‌లలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి పోలియో చుక్కలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.


మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని, ప్రతి తల్లిదండ్రి తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోరే జయ గంగమల్లు, ఏనుగుల లావణ్య రాజేందర్, కూతురు శేఖర్, కూతురు రాజేష్, చెట్టే గంగాధర్, పిట్ట ధర్మరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డా. సుజాత, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (Dy. DM&HO) శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment