- మానకొండూర్ బిజెపి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్
- విజయవంతంగా టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు
మానకొండూర్ ఏప్రిల్ 06:భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండాలను ఆవిష్కరించి టిఫిన్ బయట కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా మానకొండూర్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ బిజెపి జెండా ఆవిష్కరించారు.అనంతరం సీట్లు పంపిణీ చేశారు.అనంతరం కార్యకర్తలు అందరితో కలిసి టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం గర్వకారణం అని అన్నారు.కేవలం రెండు ఎంపీ సీట్లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడు 350 పైగా సీట్లతో సాధించిన ఘనత బిజెపి పార్టీది అన్నారు. బిజెపి పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్ఛ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణచారి,మండల ప్రధాన కార్యదర్శులు కంది రాజిరెడ్డి,సొన్నాకుల శ్రీనివాస్,కత్తి ప్రభాకర్ గౌడ్,కోశాధికారి మీసా రమణయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మార్గ సుమతి, కిసాన్ మోర్చా అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్ నాయకులు నందగిరి బలరాం,ఆరేపల్లి సునంద్, కౌటం సతీష్,పిట్టల నరేష్,బండారి హరీష్, వైద వైదిక్ రావు,వాంగల విశ్వవర్ధన్,కోండ్ర సురేష్, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
