జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వప్న, పరమేశ్, దుర్గేష్‌ల నివాస గృహాలు కూలిపోయాయి. ఈ ఘటనపై జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని అధికారులను కోరారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచ్ ఆకుల రమేష్, నాయకులు శ్రీనివాస్, అలీం, జనార్ధన్, వెంకటేష్, వేణు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply