సోమనపల్లి వాసికి డాక్టరేట్

By dhanadhannews.com

అంతర్గామ్,ధనాధన్ న్యూస్:పెద్దపెల్లి జిల్లా,అంతర్గాం మండలం,సోమనపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల దామోదర్ కి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన CSIR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) హైదరాబాద్ మరియు అకాడమీ అఫ్ ఇన్నోవాటివ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఘజియాబాద్ , న్యూ ఢిల్లీ (యూనివర్సిటీ ) నుండి ఈరోజు కెమికల్ సైన్స్ పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందడం జరిగింది.ప్రస్తుతం అరేజన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో అసోసియేట్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు.దామోదర్ కి డాక్టరేట్ పొందడం వల్ల అతని తల్లిదండ్రులు బంధుమిత్రులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.