మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం

By dhanadhannews.com

  • జమ్మికుంట మున్సిపల్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్.

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం తాను ఒక ఫంక్షన్ కి వెళ్లగా తనకి కౌన్సిలర్ రాజు తనకు ఎదురై తనకు అవహేళన చేస్తూ తనని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు.తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రజల్లో తనని చులకన చేసేలా ప్రవర్తించడని తెలిపారు.ఇంత ముందు తనపై అవిశ్వాసం పెట్టె సమయం లో తన దగ్గర 5 లక్షలు తీసుకొని తనని మోసం చేసి తనపై అవిశ్వాసం పెట్టాడని ఆరోపణ చేశాడు.తాను మున్సిపల్ లో అవినీతి కి పాల్పపడ్డానని ఆరోపణలు చేస్తున్న కౌన్సిలర్లు దమ్ముంటే తన అవినీతిని బయట పెట్టాలని సవాలు చేశాడు.కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఎక్కడెక్కడ కబ్జాలు చేశాడో తనకి, జమ్మికుంట ప్రజలకు తెలుసునని వాటిని బయటికితీసే ప్రయత్నం లో ఉన్నామని తెలిపారు. రాజకీయాలు హుందాగా చేయాలి కానీ వ్యక్తిగత రాజకీయాలు చేసి మర్యాద పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.కొందరు కౌన్సిలర్లు తనని పైసలు డిమాండ్ చేస్తే తాను ఇవ్వనందుకే తన పై అవిశ్వాసం పెట్టారని తెలిపారు. కౌన్సిలర్ రాజు కి తాను ఇచ్చిన 5 లక్షలకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వాటితో పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు జమ్మికుంట కౌన్సిలర్లు,పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.