నడికూడ, ధనాధన్ న్యూస్ : “డా. సర్వేపల్లి రాధాకృష్ణన్” గారి జయంతిని పురస్కరించుకొని నడికూడ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి  హనుమంతరావు అధ్యక్షత వహించగా,ఎంపీడీవో రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నడికూడ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, ప్రశంసాపత్రాలు జ్ఞాపికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ  హనుమంతరావు,ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ,ఉపాధ్యాయులు మరింత బాధ్యత,అంకితభావం,వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచి, నడికూడ మండలాన్ని జిల్లాలో విద్యాపరంగా ఆదర్శ మండలంగా నిలిపేందుకు ప్రతి ఉపాధ్యాయుడు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీపీటీఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి,మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యులు మోడెం రాజేందర్ బాబు,రావుల రమేష్, శ్రావణ,బిక్షపతి,రవీందర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సీఆర్పిలు రఘుపతి,కవిత,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply