ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్  ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.