- యువతి నుండి రూ.60వేల దోపిడి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాపులపల్లి కోరపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజలి (25), భర్త బైరెడ్డి విక్రమ్ రెడ్డి, ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు మార్చి 10న మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా, ఒక పేజీ ద్వారా సంప్రదింపులు జరిగాయి. అందులో భాగంగా టాస్కులు ఇచ్చి రివ్యూలు నమోదు చేసి పోస్టు చేయాలని, ఒక్కో టాస్క్‌కు రూ.200 చెల్లిస్తామని నమ్మించారు. అనంతరం ఆమెను టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు.
మార్చి 11న మధ్యాహ్నం సుమారు 3:46 గంటలకు రూ.20వేలు చెల్లించాలని సూచించగా, అది కూడా టాస్క్‌లో భాగమని చెప్పడంతో ఫిర్యాదుదారు ఫోన్‌పే ద్వారా పంపింది. తరువాత మరిన్ని టాస్కుల పేరుతో రూ.40వేలు చెల్లింపులు చేయించింది.
ఇక ఫిర్యాదుదారికి క్రియేట్ చేసిన అకౌంట్ ఫ్రీజ్ అయిందని, దాన్ని యాక్టివేట్ చేయాలంటే మరో రూ.70వేలు చెల్లించాలని కోరడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని,సోషల్ మీడియాలో వచ్చే పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దని సూచించారు.