ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే23:మర్రిపెల్లిగూడెంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందుల ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో సూపర్ స్పెషలిటీ వైద్యులు డా.భావనా రెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా.శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్,డా.విజేత రెడ్డి ఛాతి వైద్య నిపుణులు మరియు హాస్పిటల్ సిబ్బంది తమ సేవలను అందించడం జరిగింది.మర్రిపెల్లిగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్లకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి పేద ప్రజలకొరకు ముందు ముందు మరిన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.వైద్య శిబిరానికి సహకరించిన గ్రామ పంచాయితి కార్యాలయ నిర్వాహకులకు మరియు పెద్దలకు హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
https://www.facebook.com/profile.php?id=61557327330992&mibextid=ZbWKwL
