- యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ నియెజకవర్గ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్
సైదాపూర్,ధనాధన్ న్యూస్:
మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ ఎమ్మెల్యే గా గెలిచారని ఉద్యమ సమయంలో మానుకొటలో ఉద్యమకారులపై రాళ్ళురువ్విన చరిత్ర కౌశిక్ రెడ్డి దని అలాంటి నీచ చరిత్ర ఉన్న కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక కొస్తామని హెచ్చరించారు.వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
