ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో ప్రజా ప్రతిభ క్యాలెండర్‌ను హుజురాబాద్ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.సారపు సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికా విలేకరులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు దిశగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వహించాలని పేర్కొన్నారు.అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ప్రభుత్వానికి నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన పత్రికలు పారదర్శకంగా పనిచేస్తూ,సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.ప్రజా ప్రతిభ పత్రిక కూడా ఇదే విధంగా ఉన్నత సేవలు అందిస్తూ, భవిష్యత్తులో మరింత పేరు ప్రతిష్ఠలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్,బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మాజీ సర్పంచ్ రామ్ శంకర్ గౌడ్,పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్,మాజీ కౌన్సిలర్లు కె.నరసింహారెడ్డి,యాదగిరి నాయక్, కన్నెబోయిన తిరుపతి,తాటిపాముల కనుకయ్య,బొంగోని వెంకటయ్య,తాత సమ్మయ్య,కన్నెబోయిన సమ్మయ్య, మాచర్ల నరేష్,తాళ్లపల్లి రాజేష్,సందమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.