
జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో లెంకలపల్లి శరత్ కుమార్ ఘన విజయం సాధించారు.జమ్మికుంట ఆర్యవైశ్య సంఘంలో మొత్తం 1,800 మంది ఓటర్లు ఉండగా, వారిలో 792 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక జమ్మికుంట పోలీసుల భద్రత మధ్య నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ పడగా, లెంకలపల్లి శరత్ కుమార్ 461 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి రావికంటి మధుకు 319 ఓట్లు లభించగా, రావికంటి దామోదర్‌కు 9 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థికి స్వల్ప సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి.
లెంకలపల్లి శరత్ కుమార్ తన సమీప ప్రత్యర్థిపై 142 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం ఎన్నికల కన్వీనర్లు ఆయనకు అధ్యక్ష పదవి ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన జమ్మికుంట సీఐతో పాటు పోలీసు సిబ్బందికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.