దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

By dhanadhannews.com

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్సి మోర్చా అధ్యక్షులు లాల్ శింగ్ ఆర్యా,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమారు హాజరువుతారన్నారు.దళితులు అంత ఐక్యమాత్యం తో మోదీని మూడవ సారి ప్రధాన మంత్రి చేసే విదంగా కృషి చెయ్యాలని కోరారు.ప్రధాని నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క జీవితం దృష్ట్యా పంచ తీర్థ పేరుతో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేవలం నరేంద్ర మోడీకే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు,ఇల్లందకుంట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గుత్తికొండ రాంబాబు,హుజూరాబాద్ ప్రధానకార్యదర్శి మోలుగురి రమేష్,తదితరులు  పాల్గొన్నారు.