జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) సంస్థ ఆవిర్భావన జరిగి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎం.హెచ్.డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఎంహెచ్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేశ్వరం సాల్మన్ మాదిగ చేతులమీదుగా జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానం కల్పించాలని పెద్దపల్లి ఎంపీ సీటు ఈసారి మాదిగలకే కేటాయించాలని వారు అన్నారు.గత ప్రభుత్వ హయాంలో మా మాదిగలకు అన్యాయం జరిగిందని,ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వమన్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు.ఏబిసిడి వర్గీకరణ కోసం పలుమార్లు ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు ధర్నాలు చేసిన బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని,గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ 100 రోజులలో కొట్లాడైనా చేస్తామని,చేయలేదని ఈ ప్రభుత్వమన్నా ఏబిసిడి వర్గీకరణ చేయాలని,ఈ ప్రభుత్వంలోనైనా మాదిగలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంహెచ్ డి హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ మాదిగ,దొడ్డే దిలీప్,దొడ్డే రాజు,దొడ్డే శ్రీకాంత్, ఎం.హెచ్.డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
