- యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్
మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేలేదని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ హెచ్చరించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అన్నారు. ఉద్యమ ద్రోహి అయిన నువ్వు ఉద్యమ నాయకులపై విమర్శలు చెయ్యడం సిగ్గు చేటని అన్నారు. భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గెలిచిన నీకు పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే అర్హత లేదని అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మీ భార్య బిడ్డల ను అడ్డం పెట్టుకోకుండా గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. మానుకోట ఉద్యమకారులపై రాళ్ళు రువ్విన నీచపు చరిత్ర నీదని అన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలను దోచుకున్న చరిత్ర నీది కాదా అని ఆయన ప్రశ్నించారు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే నియోజకవర్గంలో తిరుగానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి శంకర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, కార్యదర్శి సాయి, విష్ణువర్ధన్, రత్నాకర్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు లావణ్య, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండి అఫ్సర్, సీనియర్ నాయకులు కోలిపాక శంకర్, రమేష్, కిరణ్ రెడ్డి, ఐలయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాఘవేంద్ర, తిరుపతి, నాగరాజు, ఎండి చాంద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
