జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మల గుడి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం గా వైభవంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం 85 వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ ట్రస్టిలు కొండూరు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భక్తులు స్వామి వారి కళ్యాణం మహోత్సవమ్ నేత్రపర్వంగా వీక్షించి మొక్కులు సమర్పించారు.ఈ కార్యక్రమం అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
