భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని […]

వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]

అంగడిబజార్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్‌కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా, సమీపంలోని చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పింది. ఆవు స్థానంలో ఎవరైనా వ్యక్తి వెళ్లి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు […]

జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]

SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]

ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]

ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ సేవా సమితి

బుగ్గారం / జగిత్యాల జిల్లా, ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో గల్ఫ్‌లో కన్నుమూసిన సాటి గల్ఫ్ కార్మికుడు పులి మహేష్  కుటుంబానికి సోమవారం రూ. 72,100 (డెబ్బై రెండు వేల వంద రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. వారి వంతు సహాయంగా గల్ఫ్ కార్మికులందరం కలిసి తల కొంత డబ్బు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా […]

అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 28: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల నరేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తుల నరేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ పేరును కేవలం స్మరించుకోవడానికే పరిమితం కాకుండా ఆయన చూపిన మార్గాన్ని ఆచరణలో అమలు చేయాల్సిన […]

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 28: ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేమాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో […]