వావిలాల గ్రామంలో వ్యక్తి మృతి.. కారణాలపై పోలీసుల విచారణ

వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి […]

‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై అవగాహన సదస్సు నిర్వహణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మెప్మా ఆధ్వర్యంలో స్థానిక వినాయక గార్డెన్‌లో గురువారం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పీడీ స్వరూప రాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం వ్యాపార […]

బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన […]

హుజురాబాద్ డివిజన్‌లో చీటింగ్ కేసులపై సీపీ సమీక్ష

కరీంనగర్/ధనాధన్ న్యూస్, ఏప్రిల్ 29:కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా చీటింగ్ (మోసం) మరియు ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను […]

ఘనంగా తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 29:తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి.సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి […]

కల్వరి టెంపుల్‌లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న కల్వరి టెంపుల్‌లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈస్టర్ పర్వదినం సందర్భంగా, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువపై మరణించి, ఆదివారం తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన ఈస్టర్‌గా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బండ రమేష్ వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థంగా […]

మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలి

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ఏప్రిల్ నెలను “మహనీయుల పండగ నెల”గా గుర్తించి, వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని దళిత రత్న వడ్డూరి కుమారస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఏప్రిల్ నెల అంటే కేవలం ‘ఏప్రిల్ ఫూల్’ మాత్రమే కాదు, దేశ చరిత్రలో చిరస్మరణీయులైన మహనీయులు జన్మించిన గొప్ప నెల” అని పేర్కొన్నారు. భారతదేశానికి విశేష సేవలు అందించిన మహానుభావులలో, అగ్రవర్గ ఆధిపత్యాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ప్రముఖ నాయకుడు […]

ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, […]

సిరిసేడు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ… ప్రభుత్వ పథకాలపై అవగాహన

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్:ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రేణికుంట్ల శ్యామల-కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని గ్రామస్తులకు ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై తమ శాఖలకు […]

డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల […]