- మానకొండూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
- కాషాయ జెండాలతో కదం తొక్కిన హిందూ సైనికులు
మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, పాకాల పురుషోత్తం రెడ్డి,ఆరెపల్లి సునంద్, కొండ్ర వరప్రసాద్, కురాకుల రాజు,వైదిక రావు,పుదరి రతన్, బూర్ల బన్ను,శానకొండ రవి,కొల శ్రీనివాస్,మాచర్ల కోటేశ్వర్,ఆరెల్లి శ్రీహరి,పొడిచెర్ల మహేందర్,బండి మహేష్,నల్ల శ్రావణ్ రెడ్డి,నూనె శ్రావణ్, శ్రీకాంత్,కనకరాజు,రాజయ్య, నవీన్,నితీష్,నవీన్,శ్రీనివాస్ పొన్నం రాజు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
