ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ కత్తెరతో కటింగ్ చేయడం స్థానికంగా వివాదానికి దారి తీసింది.విద్యార్దుల జుట్టు కత్తిరించడంపై ఇంగ్లీషు టీచర్ వివరణ ఇచ్చారు.ఇదే ఘటనపై హెచ్‌ఎం స్పందించారు.తాను క్లాస్‌కి వెళ్లి వచ్చేసరికి మేడం కట్ చేస్తున్నారని అలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు చెప్పారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.తమపిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు పిలిచి చెప్తే సరిపోతుంది కదా అని పలువురు స్టూడెంట్స్ పేరెంట్స్ అన్నారు.వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింపచేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
