నీట్ లో 492 మార్కులు సాధించిన గిరిజన బిడ్డ

By dhanadhannews.com

  • శృతికను ఘనంగా సన్మానించిన ప్రిన్సిపాల్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని రాయికల్ తండకు చెందిన బానోతు శృతిక నీట్ లో 492 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు రావడం పట్ల తల్లిదండ్రుల పాటు గ్రామస్తులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ రాయికల్ తండా గ్రామానికి చెందిన బానోతు మమత రమేష్ నాయక్ ల కుమార్తె శృతిక నీటిలో 492 మార్కులు సాధించి రాయికల్ తండాకు చెందిన విద్యార్ధి  ఏంబిబిఎస్ లో సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రాథమిక విద్య చదివి అనంతరం వంగర పివి రంగారావు హాస్టల్లో పదో తరగతి పూర్తి చేసి,హనుమకొండలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.సోమవారం రోజున వెల్లడించిన ఫలితాలలో ఎంబిబిఎస్ సీట్లలో బానోతు శృతిక సీటు రావడం పట్ల కేరళ స్కూల్ పూర్వ విద్యార్ధి శృతికను కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అనగోని తిరుపతి గౌడ్ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో  రాయికల్ తండకు సంబంధించిన నాయకులు,మాజీ సర్పంచ్ బర్మావత్ బిక్షపతి నాయక్, బర్మావత్ శంకర్ నాయక్, బానోతు రవి నాయక్, భూక్య రంగా నాయక్, ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.