- ఇండియన్ పొలిటికల్ లీగ్ పై నిరాసక్తత
- ఇండియన్ ప్రీమియం లిగ్ పై దృష్టి సారిస్తున్న యువత
- దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించని యువత
- అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన ఉత్సాహం
పార్లమెంటు ఎన్నికల్లో కానరాని యువత ప్రమేయం
ఎడిటర్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది.. రాజకీయపార్టీలకు బాండ్ల రూపంలో వందలకోట్లు విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే! అవేమి పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు.
రక్షించేవాడు లేక చెరువులు, భూములు కబ్జాల పాలవుతుంటే! అడిగేవాడే లేదని విర్రావీగుతున్న అవినీతి నాయకుల అకలి, మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని యువత కాలక్షేపం కోసం క్రికెట్ ఆటగాళ్ల ఆటలను తిలకిస్తున్నారు.ఈ దేశంలో విద్య, వైద్యం, నిరుద్యోగం ప్రమాద గంటికలు మ్రోగిస్తుంటే కుల, మాతతత్వ పార్టీలు, రాజ్యాంగాన్ని మార్చాలన్న విషపు ఆలోచనలకు బీజం పడుతుంటే! సత్తువా సచ్చిన ముసోలోడు సారాయించుకొని లేస్తుంటే! ఊరకలేసే ఉడుకురక్తం యువత క్రికెట్ మత్తులో చిత్తవుతుంటే, మాకు దేశం కన్నా క్రికెటే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించడం దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిది .దేశ భవిష్యత్తును నిర్దేశించే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగాయువతనుఏం మార్చేందుకు రాజకీయ పార్టీలు అనునిత్యం కుయుక్తులు పన్నుతూ యువత రాజకీయాల్లోకి రాకుండా అడ్డుపుల్ల వేయడం పరిపాటిగా మారింది .నేడు గ్రామస్థాయి నుండి దేశ రాజధాని వరకు యువత మొత్తం ఇండియన్ ప్రీమియం లిగులో నిమగ్నమై క్రికెట్ గురించి చర్చించుకోవడం చూస్తుంటే రాజకీయ పార్టీలు యువతను ఏమరు పాటుకు గురిచేయడం విస్మయాన్ని కలిగిస్తుంది .
పార్లమెంటు ఎన్నికల్లో కనిపించని యువత ప్రభావం
భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువగా యువతను కలిగిన దేశం ఎదేశమైతే ఎక్కువగా యువతను కలిగి ఉంటుందో ఆ దేశం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందేందుకు యువత దోహదపడుతుంది.అభివృద్ధి చెందిన అమెరికా ,రష్యా ,చైనా ,జపాన్ ,ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భారతదేశంలో పాటు ఈ సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దరిమిల అక్కడి దేశాల్లోని యువత మొత్తం దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను దీక్షనంగా పరిశీలిస్తూ తమ భవిష్యత్తును నిర్దేశించే నాయకుడు ఎవరైతే మేలు జరుగుతుందోనని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సమాయత్తమవుతుంటే భారతదేశంలోని యువత కాలక్షేపానికి పెద్దపీట వేస్తూ ఐపీఎల్ లాంటి మ్యాచ్ లను తిలకిస్తూ తమ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్న మాకేమి పట్టనట్లు వ్యవహరించడంపై పలువురు మేధావులు విద్యావేత్తలు పెదవి విరవడం నిర్గాంతపోయే విషయం. ఎన్నికల కోడ్ కూసిన నాటి మొదలు ఎన్నికలు పూర్తయి ఫలితాలు విలువడే వరకు చీమ చిటుకుమన్న స్పందించే కేంద్ర ఎన్నికల సంఘం దేశ యువతను పక్కతోవ పట్టించే ఇలాంటి చర్యలను పట్టించుకోకపోవడం పలు సందేహాలను లేవనెత్తుతోంది.
దేశ రాజకీయాలపై యువత తన ముద్రను వేయాలి
145 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన భారత దేశంలో సింహభాగం యువతదే అలాంటి యువత దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల్లో దృష్టి సారించి కుల మతాల పేరుతో రాజకీయాలు నడిపే పార్టీలకు చరమగీతం పాడుతూ దేశ యావానికపై యువత తన ముద్రను వేస్తూ దేశ రాజకీయాలను శాసించే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని కనపర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది .ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాల్సింది పోయి నేడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత సేవ చేయించుకునే దుస్థితి దాపరించడం సిగ్గుచేటు .ఇకనైనా యువతరం మేలుకొని తమ భవిష్యత్తును నిర్దేశించే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది దానికోసం దేశంలోని ప్రతి యువతి యువకులు తమకు సేవ చేసి తమ అవసరాలను ,తమ హక్కులను సాధించిపెట్టే నాయకులను ఎన్నుకునే విధంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది .లోగడ రాజకీయ పార్టీలు యువతను తమ పార్టీల వైపు మరల్చుకొని కేంద్రంలో అధికారాన్ని చేపట్టేందుకు యువతను ఒక ఆయుధంగా మలచుకునేవారు .కానీ నేడు రాజకీయ పార్టీలు యువతను మత్తు పదార్థాలు ,ఐపీఎల్ మ్యాచ్ లు ,బెట్టింగు లాంటి వ్యసనాలకు గురి చేసే విధంగా ప్రోత్సహించడం ,ఉచిత పథకాలను ప్రవేశపెట్టి యువతను సోమరులుగా మలచడం చూస్తుంటే దేశ పురోగతి దేవుడెరుగు కానీ దేశ భవిష్యత్తు అందాకారంగా మారడం ఖాయంగా ఉందని దీనికి రాజకీయ పార్టీల ఎత్తుగడలే కారణమని పలువురు మేధావులు ,విద్యావేత్తలు , రాజకీయ విశ్లేషకులు దుమ్మెత్తి పోస్తున్నారు.
