శివాజీ ఉత్సవ కమిటీ ఉన్నట్టా లేనట్టా

  • ఎంపీ బండి సంజయ్ చేతులమీదుగా ఘనంగా చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ
  • కానీ జయంతి ఉత్సవాల నిర్వహణ కరువు
  • ఆకునూర్ గ్రామంలోని శివాజీ విగ్రహానికి ఆదరణ కరువు

సైదాపూర్,ధనాధన్ న్యూస్:

సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గత సంవత్సరంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా ఆకునూరు గ్రామంలో శివాజీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్,స్వామి వివేకానంద,చత్రపతి శివాజీ విగ్రహాలను అన్నదానాలతో అంగరంగ వైభవంగా  ఆవిష్కరించారు.అంతవరకు బాగానే ఉన్నా,ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన తరువాత మొదట వచ్చిన జయంతి ఉత్సవాలను సోమవారం రోజున ఎవరు నిర్వహించలేదు.అందుకు గల కారణాలు ఏమైనా ఉత్సవ నిర్వహణ చేయకపోవడం మాత్రం గ్రామ ప్రజలను ద్రిగ్బంతికి గురిచేసింది.కనీసం వచ్చే ఏడాది జరిగే శివాజీ జయంతి ఉత్సవాలైన ఘనంగా  నిర్వహించేలా శివాజీ కమిటీ మెంబర్లు,గ్రామస్థాయి నాయకులు,అధికారులు దృష్టి పెట్టాలని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.