అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

By dhanadhannews.com

  • తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్
మాట్లాడుతున్న రాచపల్లి సాగర్.

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం కూడా సరికాదని తెలిపారు.పైగా ఏదో ప్రజలపై ప్రేమ చూపినట్టు ప్రవర్తిస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి లేరని,దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చి రెండో విడత మంజూరు చేయాలని మాట్లాడడం మంచిది కాదని తెలిపారు.

ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మనం ప్రజలకు ఏం చేశామో ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి.లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం రానున్న రోజుల్లో తప్పకుండా చెబుతారని అన్నారు.అలాగే దళిత బంధు రెండో విడత మంజూరు విషయంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రెండో విడత గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రెండో విడత మంజూరు చేసే వరకు ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతామని ఈ సందర్భంగా సాగర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు వడ్లూరి అరుణ్,దళిత సంఘాల నాయకులు చంద్రగిరి రజినీకాంత్,కొలుమూరి రవీందర్,రాచపల్లి అశ్విన్,తదితరులు పాల్గొన్నారు.