అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 11న హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యలయంలో నిర్వహించే ఉపాధి మహిళా అవకాశాలు సాధికారత సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ మహిళా జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి కోరారు.ఆదివారం రోజు ఒక పత్రికా ప్రకటన లో మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం మహిళా జన సమితి ఆధ్వర్యంలో జరిగే మహిళా సదస్సుని పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా మహిళలను కోరారు.కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న మధ్యపానాన్ని నిషేదించుకునే అధికారం గ్రామ పంచాయితీలకు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.57 ఏళ్లు సంవత్సరాలు నిండిన మహిళలకు వెంటనే ఆసరా పించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు కావల్సిన హక్కులను సాధించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని,మహిళలందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
