- ప్రధాని మోదీ,రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం
- జమ్మికుంట రైల్వే ప్రయాణికులకు,వ్యాపారస్తులకు ఇది శుభవార్త లాంటిది
- కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ
దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంటలో ఆపేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ పలుమార్లు కేంద్రం దృష్టికి,రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, తప్పనిసరిగా జమ్మికుంటలో ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారని తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్ నుండి దాణాపూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంట స్టేషన్ లో ఆగేలా ఏర్పాట్లు చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు. దాణాపూర్ ఎక్స్ ప్రెస్ తో కాశీ,నాగపూర్ వంటి పట్టణాలకు నేరుగా వెళ్లే అవకాశం కలిగిందని, తద్వారా ఎంతో సమయం,డబ్బు ఆదా అవుతాయని,ప్రయాణికులకు వ్యాపారస్తులకు ఇది ఎంతో ఉపయోగకరమని,ప్రజలందరికీ ఇది శుభవార్త లాంటిదన్నారు.ఈ కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డి, మాడ వెంకటరెడ్డి, జీడి మల్లేష్,పల్లపు రవి,తిరుపతి శ్రీనివాస్,ఠాగూర్ రాజేష్,మోతే స్వామి,అప్పం మధు యాదవ్,కొలకని రాజు,ఇటికల సరూప,మోడం రాజు, ఠాగూర్ రాకేష్,గిరవని విజేందర్,గండికోట సమ్మయ్య,రాచపల్లి ప్రశాంత్,శనిగరపు రవి,లకిడే రాజు,మర్రి రవీందర్,గుర్రం సంతోష్,ఏ.రామస్వామి, మేడిపల్లి మహేష్,కేశ స్వరూప,గుండ్ల తిరుపతి, యoసాని సమ్మయ్య,ముకుందం సుధాకర్,అప్పల రవీందర్,నాగపురి విజయ్,మంతిని అశోక్, కార్యకర్తలు,వ్యాపార వేత్తలు తదితరులు పాల్గొన్నారు.
