స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

By dhanadhannews.com

  • అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చిన సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు విద్యావంతులుగా ఎదగాలని పిల్లలకు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తమేక మల్ల రత్నం,తిప్పారపు రమేష్ బాబు, శ్రీనివాస్,దొడ్డరాజు,చిరంజీవి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.