జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్27:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానానికి ఈనెల 30న రానున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శనివారం డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రధాన వేదిక తో పాటు కార్యకర్తలు కూర్చోవడానికి అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను పర్యవేక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జమ్మికుంట కు రేవంత్ రెడ్డి రానున్నారని,కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ గ్రామాల నుండి వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా త్రాగునీటి వసతి, వైద్య సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి తో పాటు జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్,మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని, కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
