కాంగ్రెస్ ప్రచారంలో ప్రణవ్ మార్క్

  • అన్నీ తానై హుజురాబాద్ ప్రచారంలో ముందుకు వెళ్తున్న ప్రణవ్
  • ఈ సారి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి అధిక మెజారిటీ వచ్చేలా ప్లాన్
  • ప్రణవ్ మార్క్ తో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో నయా జోష్
  • అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవే తన లక్ష్యం
  • బిజేపి,బిఆర్ఎస్ దొందు దొందే
  • రామరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
  • ఎన్నికల ప్రచారంలో ప్రణవ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే02:ఓవైపు మండుటెండలు దంచి కొడుతున్న అదే మండుటెండల్లో ఎండకు తగ్గట్టుగా తన స్పీచ్ తో సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్.గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే తమ ప్రభుత్వం ఏం చేసిందో,చేసిన ఆరు గ్యారెంటిలను ప్రజలకు వివరించి చెప్తున్నారు.ప్రణవ్ బాబుకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం దానికి తగ్గట్టుగా అందరినీ కలుపుకొనిపోయే ప్రణవ్ బాబు ఈ సారి హుజురాబాద్ నుంచి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎక్కువ మెజారిటీ వచ్చే ప్లాన్ చేస్తున్నారు.తన మాటలతో ప్రచారాన్ని మరింత వేడెక్కించారు.గురువారం వీణవంక,జమ్మికుంట, ఇళ్ళందకుంట ప్రచారంలో ప్రణవ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని,బిజెపి పార్టీ తనకు నచ్చని వారిని ఈ.డి,సిబిఐ పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారని,రైతులకు రుణమాఫీ చేయలేని బిజెపి పార్టీ,బడా బాబులకు మాత్రం లోన్ మాఫీలు చేస్తుంది అని దుయ్యబట్టారు.మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తామంటే ఏమిటో చెప్పామని అన్నారు.ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎంగా సవాల్ చేసిన దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి అని అన్నారు.అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం,ఆహార భద్రత,108,104,ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి పేదలకు అవసరం వచ్చే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైన స్థితిలో ఉన్నారని అన్నారు.సెంటిమెంటు రాజకీయాలు మరల నియోజక వర్గంలో పనిచేయవు అని అన్నారు.బిఆర్ఎస్,బిజెపి రెండు పార్టీలు దొందు దొందే అని వాటికి ఓటు వేస్తే ఏం ప్రయోజనం ఉండదని అన్నారు.ఈసారి హుజురాబాద్ నుంచి పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకువచ్చి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.