- యూత్ ఐకాన్ బండి సంజయ్
- బండి స్పూర్తితోనే తమిళనాడులో పాదయాత్ర
- బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లే
- బండి సంజయ్ పోరాటాలను,నాయకత్వాన్ని కొనియాడిన అన్నామలై
- తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై అద్బుత ప్రసంగం
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు,కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్ కే సొంతమన్నారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్ కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి బండి సంజయ్ తోపాటు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాపరామక్రిష్ణ తదితరులు హాజరైన ఈ సమావేశంలో అన్నామలై ప్రసంగం అద్బుతంగా సాగింది. అన్నామలై ప్రసంగిస్తున్నంత సేపు చప్పట్లు, ఈలలతో యువత కేరింతలు కొట్టారు.ముఖ్యంగా బండి సంజయ్ పోరాటాలను,పార్టీ బలోపేతానికి చేసిన సేవలను, పాదయాత్ర చేసిన తీరును వివరిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి విన్నారు. బండి అభిమానులు ఆనందభాష్పాలు రాల్చారు.ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ అందమైన తెలుగు భాషను మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలి.బండి సంజయ్ అద్భుతమైన నాయకుడు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నడు.పోరాట యోధుడుబండి సంజయ్ తెలంగాణకే కాదు,దక్షిణ భారతదేశానికి నాయకుడిని అందించారు.బండి సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే నేను తమిళనాడులో పాదయాత్ర చేసిన నాకు ఏ నాయకుడు అధ్యక్షహోదాలో ఉంటూ అరెస్ట్ కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే దానిపై పోరాడినందుకు అనేకసార్లు అరెస్టయిన నాయకుడు బండి సంజయ్.ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.ఆయన దక్షిణ భారత దేశంలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకం ఉంది.
బండి సంజయ్ యూత్ ఐకాన్ యువత ఆలోచనలను,ఆవేశాన్ని, కుటుంబ పాలన అవినీతి పోరును ప్రదర్శిస్తున్నారు.అందుకే బండి సంజయ్ చారిత్రాత్మక విజయాన్ని కరీంనగర్ ప్రజలు అందించబోతున్నారనే నమ్మకం ఉంది.కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని గద్దె నెక్కాక వాటిని పూర్తిగా విస్మరించింది.మహిళలకు రూ.2500లు ఇవ్వనేలేదు,రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదు,రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు,రైతు భరోసా కింద రైతులు,కౌలు రైతులకు రూ.15 వేలు,రైతు కులీలకు రూ.12 వేలు ఇవ్వలేదు,ఇంటి జాగా,రూ.5 లక్షల సాయం చేయలేదు,అబద్దాలనే పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నాడు.గుజరాత్ తో తెలంగాణ పోటీ అంటున్న రేవంత్ రెడ్డి గుజరాత్ లో సబర్మతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో మూసీ నదిని మీరెందుకు ప్రక్షాళన చేయలేదని,తమిళనాడులో పంట నష్టపోతే పరిహారం అందిస్తున్నామని,మరి తెలంగాణలోఎందుకు ఇవ్వడం లేదని,కిసాన్ సమ్మాన్ నిధిని యూజ్ లెస్ స్కీంగా కేసీఆర్ తీసిపారేశారు.కానీ రైతులకు మాత్రం మెరుగైన సాయం ఎందుకు చేయలేకపోయారని తెలిపారు.
బండి సంజయ్ కు 60 శాతం ఓట్లు రావాలని, మిగిలిన పార్టీలకు 40 శాతం పార్టీలు పడాలని అన్నారు.ఎందుకంటే బండి సంజయ్ ను అడుగడుగునా అవమానించారు.ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేశారు.జైలుకు కూడా వెళ్లారని, ఫోన్ ట్యాపింగ్ తో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని తెలిపారు.మోదీ కోసం 5 రోజులు కష్టపడండి,మోదీ మీకోసం 5 ఏళ్లు కష్టపడి సేవ చేస్తారని తెలిపారు.
బండి సంజయ్ ఏమన్నారంటే…
భారతదేశ సింగమలై,మన అన్నామలై. అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజాసమస్యలపై యుద్దం చేస్తున్న నేత అన్నామలై.నిరంతరం పాదయాత్ర చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నాయకుడు. తమిళనాడులో బీజేపీ శక్తివంతంగా తయారు కావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు.
మేం పువ్వు గుర్తుపై ఓటేయాలని తిరుగుతుంటే… సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుడ్డు గుర్తు పట్టుకుని తిరుగుతున్నరు.కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయాలనుకునే వాళ్లు బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే ఓటేయండి.
మోదీపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నరు.ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదు. కరీంనగర్ లో ఆ పార్టీ 3వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసింది.మహిళలకు రూ.2500లు ఇవ్వలేదు. రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదు. రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలే. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వలేదు. ఇంటి జాగా, రూ.5 లక్షల సాయం చేయలేదు… ఇవేమీ ఇవ్వనందున జనం తిడుతుంటే.. చర్చను దారి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు గుర్తు పేరుతో చర్చను పక్కదారి పట్టించారు.
ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలారా యూపీఏ 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల స్కాంలకు పాల్పడింది.2జీ, బొగ్గు,సహారా,గాలి,నీటితోసహా అన్ని రకాల స్కాంలకు పాల్పడింది.వీళ్లా ధరల పెరుగుదల గురించి మాట్లాడేది?
కరీంనగర్ లో బీజేపీ గెలవాలని దేశంలో మళ్లీ మోదీ ప్రధాని కావాలని,మాకు దేశ భవిష్యత్తు ముఖ్యమని,ఈ దేశం రక్షించబడాాలంటే ఏకైక నాయకుడు మోదీ మాత్రమేనని,కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ (ప్రధాని అభ్యర్ధి) లేరని ఏద్దేవా చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
