ప్రభుత్వ భూమి కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు.ధర్మారం గ్రామంలోని సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట శిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో  ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయింది.అప్పటి నుండి ఆ కుంట ఖాళీగా బొందలుగా ఉండేది.ఈ భూమిని ఆనుకొని ఉన్న భూమిలో అనాధికారంగా లే అవుట్ లు పర్మిషన్ లేకుండా గజం భూమిని రూ 20 వేల చోప్పున గుంటకు రూ 24 లక్షలకు అమ్ముతున్నారు.

ఈ భూములు అమ్మినవారి ప్రక్కనే ఉన్నా 0-33 గుంటల శిఖం భూమిపై కన్ను పడి ఎవరికి వారి చదును చేసుకుంటు భూమి హద్దులు చేరిపివేస్తు ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. కొందరు వ్యక్తులు ఈనెల 25వ తేదీన  టిప్పర్లతో మొరo పోసి భూమిని చదును చేశారు.ఈ ప్రభుత్వ శిఖం భూమికి బహిరంగ మార్కెట్లో రూ 8 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని పేర్కొన్నారు.ఈ ప్రభుత్వ భూమిలో మొరం పోసేటప్పుడు జమ్మికుంట తాసిల్దార్ కు  సమాచారం ఇచ్చిన  పట్టించుకోలేదని పేర్కొన్నారు.ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరు ప్రక్కల ఉన్న (ప్రభుత్వ శిఖం భూమి) సర్వే నంబర్ 0-33 గుంటలకు హద్దులు పెట్టి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఆయన కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.