ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

By dhanadhannews.com

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి దాతగా గుజ్జ రాజశేఖర్ రావు-సునీత దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమములో ఆలయ చైర్మన్ దుగ్గినాల రవీందర్,వైస్ చైర్మన్ తిరుపతి రావు,కోశాధికారి రాజు కమిటీ సభ్యులు ప్రభాకర్ రావు,రాజేశ్వర్ రావు,రవీందర్ రావు,మహేందర్,కిరణ్,సంపత్ రావు,రాజశేఖర్,వెంగళ్ రావు,రాజు,రంజిత్ కుమార్,గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.