జగ్గయ్యపల్లి లో రేపు పెట్రోల్ బంక్ ప్రారంభం

By dhanadhannews.com

  • నెరవేరనున్న రైతుల కల
  • గతంలో డిజీల్ బంక్,పెట్రోల్ కూడా అందుబాటులోకి
  • తీరనున్న వాహనదారుల కష్టాలు
  • జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బంక్ ప్రారంభం
  • అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన ప్యాక్స్ చైర్మెన్ పొనగంటి సంపత్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్07:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లిలో గల డీజిల్ బంక్ పెట్రోల్ బంక్ గా అప్డేట్ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందనీ జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు.చుట్టూపక్కల రైతులు,ప్రజలు,సొసైటీ సభ్యుల సహకారంతో ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జమ్మికుంట-వీణవంక ప్రధాన రహదారిలో గల ఈ బంక్ డీజల్ బంక్ గా ప్రారంభం అయి రైతులకు చాలా వరకు ఉపయోగపడింది.రైతులు నాట్లు వేసే సమయంలో అటు గా వెళ్లే వాహనదారులకు చాలా వరకు ఈ బంక్ ఉపయోగపడింది.జమ్మికుంట ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఈ బంక్ చుట్టు ప్రక్కన గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడింది.ఇప్పుడు పెట్రోల్ అందుబాటులోకి రావడం వలన ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.రైతులు నాట్లు వేసే సమయంలో కోతల సమయంలో జమ్మికుంటకు వెళ్లకుండా తమ పనులు పూర్తి చేసుకున్నారు.రాబోయే రోజుల్లో జమ్మికుంట సోసిటీ మరింత అభివృద్ధి చెంది రైతులకు మరింత సేవ చేయాలని రైతులు కోరుతున్నారు.