బడి బాటకి విస్తృత ప్రచారం

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక ఉల్లాసం పంచే ఆహ్లాదకర విశాల మైదానంలో క్రీడా నైపుణ్య శిక్షణ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెరుగు దేవేందర్ రెడ్డి కోరారు.ఈ బడిబాట కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.