జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రిని కోరడం జరిగింది.మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని చెప్పడం జరిగిందని జమ్మికుంట కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి మల్లయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి,కౌన్సిలర్లు బొంగోని వీరన్న,ఎలగందుల సరూప శ్రీహరి,పిట్టల శ్వేతా రమేష్,పొనగంటి సారంగం,పొనగంటి రామ్మూర్తి,బిట్ల కళావతి మోహన్,గుల్లి పులమ్మ మొగిలి,కుతాడి రాజన్న,దేశిని రాధా సదానందం,దిడ్డి రాము,రావికంటి రాజు,తదితరులు పాల్గొన్నారు.
