ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మెహేంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు వివిధ డిజైన్లలో మెహందీ పెట్టుకొని పెట్టుకొని ప్రదర్శించారు. మెహందీ పెట్టుకున్న విద్యార్థుల పిల్లల చేతులు ఎర్రబడి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం పండుగలో మెహందీ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.మెహందీ లేకుండా మన భారత దేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోరని  గుర్తు చేశారు.మన భారత దేశ ఆచారాలపై ఆసక్తిని పెంపొందించాలని ఉద్దేశంతో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులచే వివిధ డిజైన్లు పెట్టుకున్న మెహందీ మన సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తు చేసే వేడుకలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.