- సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాచర్ల నగేష్ గౌడ్ బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందాడు మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందలేదని వెంటనే నిధులు మంజూరు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.ఈ విషయంలో,రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక చొరవ చూపెట్టి గీత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ కవచం కిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గీత కార్మికులకు తక్షణమే అందించాలని ప్రమాదాల బారిన పడకుండా గీత కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
