సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
